బోరుబావి నుంచి క్షేమంగా బయటపడ్డ బాలుడు

బోరుబావి నుంచి క్షేమంగా బయటపడ్డ బాలుడు

ఉత్తరప్రదేశ్‌లో బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆగ్రాలోని ఫతేబాద్ ధరియాయి గ్రామానికి చెందిన శివ అనే బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి 150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు..తాళ్లతో బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఆర్మీ సాయంతో ఆ బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

శివ అరుపులు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కేకలు వేయడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు..బోరు బావిలోంచి కాపాడేందుకు వారి ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది. దీంతో వెంటనే పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. బాలుడిని బయటకు తీసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తూ సమాంతరంగా గొయ్యి తవ్వారు. బాలుడి పరిస్థితిని తెలుసుకునేందుకు మైక్రో కెమెరాలను పంపించారు. లేటెస్ట్‌ టెక్నాలజీ సాయంతో తీవ్రంగా శ్రమించి.. చిన్నారిని క్షేమంగా బోరుబావిలోంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు భయాందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు..గ్రామస్తులు బాలుడుని చూసి సంతోషం వ్యక్తం చేశారు.